వేసవిలో ఇలా చేయండి

by

1.ఈ కాలంలో కిటికీలకు, గుమ్మాలకు వట్టి వేర్ల తెరలను తడిపి కట్టుకుంటే వేడిని ఇంట్లోకి రానీయకుండా అడ్డుకుంటాయి.

2.ఈ మండుటెండల్లో చెమటతో తడిసి ముద్దవుతాం. కొందరికైతే శరీరం నుంచి దుర్వాసన కూడా వస్తుంటుంది. వీలైనంత వరకూ ఈ కాలంలో టీ, కాఫీలకు దూరంగా ఉండాలి.

 

3.వేసవిలో ఎండ వేడికి కమిలిపోయే ముఖచర్మాన్ని పాలపొడి పూర్వపు స్థితికి తీసుకొస్తుంది. ఇందులోని ల్యాక్టిక్‌ యాసిడ్‌ చర్మాన్ని మృదువుగా, కాంతిమంతంగా మార్చేస్తుంది.
రెండు చెంచాల కమలాపండు రసానికి చెంచా ఓట్‌మీల్‌ పొడి, చెంచా పాలపొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేస్తే చాలు.

4. ఈ కాలంలో ఇంట్లో ఉన్నా,బయటకు వెళ్లినా రోజూ కనీసం రెండు సార్లైనా సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవడం తప్పనిసరి. ఇది యూవీ కిరణాల ప్రభావాన్ని చర్మంపై పడనివ్వదు.

5. వేసవిలో మామిడి పండ్లను ఎక్కువగా తినండి. ఈ పండ్లలో బీటా కెరొటిన్‌ అనే పదార్థం ఉంటుంది. ఇది ఎండ తీవ్రతను తట్టుకునే శక్తిని ఇస్తుంది. పైగా యాంటీ ఆక్సిడెంట్లు అధికం. మామిడి పండ్ల వల్ల సెగ గడ్డలు వస్తాయంటారు. కానీ ఇది అపోహ మాత్రమే.

 

6. తగినంతగా నీరు, నిమ్మరసం, తాజా పండ్లరసాలు, కొబ్బరినీళ్లు వంటి ద్రవాహారాలను ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే చర్మసంబంధిత అనారోగ్యాల నుంచి బయటపడొచ్చు.

7.వేడిని తగ్గిస్తుంది: నీళ్లలో సబ్జాగింజలు వేసుకుని కాస్త పంచదార లేదా తేనె కలిపి తాగితే ఎండ వేడి నుంచి రక్షించుకోవచ్ఛు నిమ్మకాయ నీళ్లు, షర్బత్‌లు, మిల్క్‌షేకుల్లో చల్లదనం కోసం సబ్జా గింజలను కలిపి తాగొచ్ఛు.

Leave a Comment