చేతివ్రేళ్ళు పొరలు ఊడకుండా ఉండాలి అంటే ఏంచెయ్యాలి?
చేతి వేలిగోరు ప్రక్క పొరలు చాల చిన్నవి ఆయన అవి ఊడినపుడు అత్యంత బాధాకరంగా ఉంటుంది. ఇలా గొరిచుట్టూ పొరలు చాల కారణాలు వల్ల ఊడిపోవచ్చు. వాటిలో కొన్ని చర్మంలో తేమ తగ్గడం, గోర్లు కొరికే అలవాటు వల్ల అవ్వడం, పేపర్ కట్స్ వల్ల కూడా అయి ఉండొచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
గోరువెచ్చని నీటిలో ముంచండి: పొర ఊడిపోయిన ప్రదేశాన్ని కాసేపు గోరు వెచ్చని నీటిలో ఉంచండి. ఇలా రోజుకి 3-4 సార్లు చేయడం వల్ల రక్తప్రసవన బాగా జరుగుతుంది.
నెయిల్ కట్టర్: నెయిల్ కట్టర్ తో ఊడిన వ్రేలు పొరలను మెల్లిగా కట్ చేయడం వలన బట్టలకి కానీ చుట్టూ ప్రక్కల వస్తువులు కానీ తగలకుండా ఉంటుంది.
మోయిస్తూరైజర్: చర్మం పొడిబారడం వలన వ్రేలి పొరల సమస్య అధికం అవుతుంది. కావున వ్రేలి చుట్టూ మోయిస్తూరైజర్ రాయడం వలన ఊడిన వ్రేలి పొరలు తగ్గడమే కాకుండా కొత్తవి రాకుండా ఉంటాయి.
ఆయింట్మెంట్: ఒకవేళ మీకు వ్రేలి చుట్టూ ఇన్ఫెక్షన్స్ అయింది అనిపిస్తే యాంటీబయాటిక్ ఆయింట్మెంట్ రాసుకోవడం వల్ల కాస్త ఉపశమనం కలుగుతుంది.
వంటింటి చిట్కాలు:
అవకాడో పేస్ట్: అవకాడో లో ఉన్న ఆరోగ్యమైన మరియు సహజమైన ఫ్యాట్స్ వల్ల వ్రేలి పొరలు చాల బాగా తగ్గుతాయి. అవకాడో పేస్ట్ లో కాస్త వర్జిన్ కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ కలిపి పేస్ట్ని వేళ్ళకి రాసుకోవాలి. కాసేపు ఆరిన తరువాత సబ్బుతో కడిగేసుకోవాలి. ఆలా తగ్గేవరకూ చేస్తూ ఉండండి.

ఏలొవెరా జెల్: ఏలొవెరా జెల్ లో ఆంటిబయోటిక్ లక్షణాలు ఉండటం వల్ల వ్రేలి పొరలు తగ్గి ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఏలొవెరా పేస్ట్ రాసి ఆరిన తరువాత కడిగేసుకోండి

విటమిన్ ఈ ఆయిల్: విటమిన్ ఈ ఆయిల్ చర్మానికి తేమను ఇస్తుంది. వ్రేలి గోళ్ళని గోరు వెచ్చని నీటిలో ముంచి తీసాక ఒక మెత్తని గుడ్డని విటమిన్ ఈ ఆయిల్ లో ముంచి ఆరేవరకు ఉంచాలి.

తేన: తేన సహజమైన మోయిస్తూరైజర్ లాగ పనిచేస్తుంది. దీనిని గోళ్ళ చుట్టూ పక్కల ప్రదేశాలలో రాసి ఒక త్రీ-౪ గంటల వరకు ఉంచాలి. ఇలా త్రీ-౪ వారల వరకు చేయాలి.

గ్లిసరిన్: గ్లిసరిన్ ఓస్మోసిస్ అనే పద్ధతిలో గోలి వేర్ల చుట్టూ ఊడిపోయిన చర్మాన్ని బాగుచేస్తుంది. గ్లిసరిన్కి కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్
కలిపి రాసుకోడం వలన ఫలితాలు ఉంటాయి.

*నోట్: ఒకవేళ గోరి చుట్టూ ఇన్ఫెక్షన్ అయింది అనిపిస్తే డాక్టర్ని సంప్రదించడం మంచిది.