గురకకు ఇక గుడ్ బాయ్
గురక అందరికి సర్వసాధారణం. కానీ కొన్ని సందర్భాల్లో గురక వలన కొంత మంది ఎంతో ఇబ్బందిపడుతూ ఉంటారు. గురక చేత గాఢ నిద్రపట్టకపోవడమే కాకుండా చుట్టూ పక్కనవారికి కూడా నిద్రాభంగం కలుగుతుంది.

మన రోజువారీ చేసే పనులలో చిన్న చిన్న మార్పుల చేయడం వలన కూడా గురకను తగ్గించుకోవచ్చు. అవి ఏమిటంటే :
1.బరువు తగ్గడం: అధిక బరువు వలన మెడ, గొంతు చుట్టూ ఉండే కొవ్వు కణజాలాలూ కరిగి ఊపిరి తీసుకోవడం సులభం అవుతుంది. అందువలన గురక సమస్య తగ్గి గురకనుండి ఉపశమనం కలుగుతుంది.

2. నిద్ర భంగిమ: పడుకునే అప్పుడు వాయుమార్గాలు మూసుకోకుండా, ఒక పక్కకి తిరిగి పడుకోవడం వాళ్ళ గురక తగ్గుతుంది

3. ధూమపానం మరియు మద్యం తగ్గించాలి: ధూమపానం వలన గొంతులో చికాకు, మద్యం సేవించడం వలన కండరాలకు ఇబ్బంది కలుగుతుంది. దీనివలన గురక సమస్య అధికం అవుతుంది.అందువలన ధూమపానం మరియు మద్యానికి దూరంగా ఉండటం మంచిది.

4.మంచినీరు తాగాలి: ఒంటిలో నీరు శాతం తగ్గినప్పుడు, గొంతులో శ్లేష్మం పెరిగి గురక సమస్య తలెత్తుతుంది. అందువలన ఒంటికి కావాల్సినంత మంచినీటిని తాగుతూ ఉండాలి.

5. మంచి ఆహారం : నిద్రపోయే ముందు భారీ భోజనం చేయడం లేదా అధికమైన కొవ్వు పదార్ధాలు వంటివి తినడం వల్ల గొంతు కండరాలు వాపుకు గురికావడం వంటివి జరుగుతాయి. అందువలన గురక తగ్గడానికి పడుకునే ముందు ఇలాంటి ఆహరం తీసుకోవడం తగ్గించుకోవాలి.

6. నిద్ర: మనిషి శరీరం ఆరోగ్యాంగా పనిచెయ్యాలి అంటే సుఖమైనా నిద్ర ఎంతో అవసరం. శరీరం అలసటకు, నిద్రలేమికి గురి అయినపుడు గురక సమస్య అధికమయ్యే అవకాశాలు ఎక్కువ. అందువలన ౭-౯ గంటల నిద్ర ఉండటం మంచిది.

7. తలకింద ఎత్తు పెట్టుకోవాలి: తలకింద ఎత్తు పెట్టుకోవడం వల్ల వాయుమార్గాలకు అడ్డులేకుండా ఉంటుంది. అందువలన గురక తగ్గడానికి ఉపయోగపడుతుంది.

8. ఆవిరి పట్టడం: ఆవిరి పట్టడం వలన గొంతులో శ్లేష్మం తగ్గి గురక సమస్య తగ్గుతుంది.

9. నోరు మరియు గొంతు వ్యాయామం: గొంతు మరియు నోటి వ్యాయాయం వలన కండరాలు గట్టిపడి గురక సమస్య తగ్గుతుంది.

**నోట్: గురక సమస్య అధికంగా ఉండి ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది వంటివి ఉంటె డాక్టర్ను సంప్రదించడం మంచిది.
Useful
Useful