మోచేతులు మోకాళ్ళ నలుపు పోగొట్టడం ఎలా??

by

                మోచేతులు మోకాళ్ళ నలుపు పోగొట్టడం ఎలా??

సాధారణంగా ఇతర శరీరభాగాలతో పోల్చుకుంటే ఎక్కువ శాతంమందికి మోకాళ్ళు మోచేతులు దగ్గర నల్లధనం ఎక్కువగ ఉంటుంది. ఈ నలుపు అనేక కారణాల వల్ల రావొచ్చు. వాటిలో కొన్ని చర్మం పైన పేరుకున్న మృతకణాలు వల్ల, సూర్యరశ్మి వలన వచ్చే హైపర్పిగ్మెంటేషన్ వల్ల, రాపిడి వల్ల, హార్మోన్ల అసమతుల్యత ఇలా వేరే వేరే కారణాల వలన అయి ఉండవచ్చు.

Source : Quora

కానీ కొన్ని అద్భుతమైన మరియు సులువైన వంటింటి చిట్కాల వలన ఎహ్ నల్లదాన్నని పోగొట్టవచ్చు. అవేంటో చూద్దాం:

For English version click the below link

Get rid of Dark knees and elbows 

నిమ్మరసం: నిమ్మకాయలో ఉండే విటమిన్ సి మరియు ఆమ్లసంబంధమైన లక్షణాల వల్ల నిమ్మరం మోకాళ్ళు మోచేతుల నలుపు పోగొట్టడానికి సహాయపడుతుంది. ఈ నిమ్మరసాన్ని బేకింగ్ సోడా లేదా మంచి నీరుతో కలిపి పేస్టులాగా చేసుకుని నల్లగా మారిన ప్రదేశాల్లో రాసుకుని ఆరిన తరువాత కడిగేసుకోవాలి.

Source : Britannica

పెరుగు: పెరుగు చర్మంలో తేమను పెంచుతుంది. అలాగే చర్మంపైన మృతకణాలను తొలిగించి నల్లదాన్నని పోగొడుతుంది. పెరుగులో కాస్త శనగపిండిని కలిపి ఆ పేస్టును రాసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

Source : Times of India

బేకింగ్ సోడా: బేకింగ్ సోడా సహజమైన స్క్రబ్లాగ పనిచేస్తుంది. అంతే కాకుండ దానిలో ఉండే క్లీన్సర్ వంటి లక్షణాలు నల్లధనాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఈ బేకింగ్ సోడాను కాస్త  మంచినీటితో కలిపి ఆ పేస్టును ఉపయోగించవచ్చు.

Source : Highland Heights, KY Dentist

కలబంద: కలబందలో ఉండే ఎలోసిన్ శరీరంలో మెలనిన్ ఉత్పత్తిని అదుపులో ఉంచుతుంది. దీనివల్ల చర్మపైన నలుపుతో పాటు హైపెరిపిగ్మెంటేషన్ కూడా తగ్గుతుంది. కలబంద గుజ్జు లేదా కలబంద జెల్ను రాసుకోవచ్చు.

Source : Vocal

పసుపు: పసుపులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. పసుపును పాలు/పెరుగు మరియు తేనెతో కలిపి రాసుకోవచ్చు. ఇలా చెయ్యడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి

Source : Medical News Today

బంగాళాదుంప రసం: బంగాళాదుంప రసం సహజమైన బ్లీచ్ వలె పనిచేస్తుంది. అందువలన అయితే బంగాళాదుంప రసం లేదా బంగాళాదుంప ముక్కల్ని కోసి నల్లటి ప్రదేశాల్లో రాసుకోవచ్చు.

Source : Pride Magazine Nigeria

కొబ్బరినూనె: దీనిలో ఉండే అవసరమైన కొవ్వు ఆమ్లాలు(ఫ్యాట్టి ఆసిడ్స్) మరియు విటమిన్ ఈ చర్మం పైన నల్లదాన్నని పోగొడతాయి. అందువలన స్నానికి వెళ్లేముందు కాస్త కొబ్బరినూనెను నల్లటి ప్రదేశాల్లో మర్దన చేసుకోవడం వలన చక్కటి ఫలితాలు ఉంటాయి.

Source : Medical News Today

బియ్యం నీరు: బియ్యం నీటిని పూర్వికులు అనేక విధాలుగా వాడేవారు. చర్మసంరక్షణకే కాకుండా పలువిధమైన ఆరోగ్య సమస్యలకు బియ్యంనీటిని ఉపయోగించేవారు. ఈ బియ్యం నీటిని మోకాళ్ళు మోచేతులు రాయడం వలన నల్లధనం తగ్గి చేతులు మృదువుగా ఉంటాయి.

Source : Tree hugger

**నోట్: వంటింటి చిట్కాలకు ఫలితాలు రావడానికి కాస్త సమయం పట్టవచ్చు. కావున కాస్త ఓపికతో కొన్ని నెలలు పాటించాల్సిన అవసరం ఉంది.

 

Leave a Comment