చంకలో దుర్వాసన ఇక దూరం

by

                                    చంకలో దుర్వాసన ఇక దూరం

నలుగురి మధ్యలో మసులుతున్నప్పుడు చమట, ఇతర కారణాల వాళ్ళ వచ్చే చంకలో దుర్వాసన ఎంతోమందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొన్నిసార్లు తాజాగా స్నానం చేసి వచ్చిన కొద్దిసేపటికే దుర్వాసన మొదలవుతుంది. ఈ చంకలోదుర్వాసనకు కల కారణాలు ఏమైవుండొచ్చు ?? ఎలాంటి వంటింటి చిట్కాలు శరీర దుర్వాసన నుండి విముక్తిని కలిగిస్తాయి?

Source : eMediHealth

శరీర దుర్వాసనకు అనేక కారణాలు ఉండవొచ్చు. వాటిలో కొన్ని అనారోగ్యాల వలన, ఒంటిలోని బాక్టీరియా చెమటను ఆమ్లాలుగ మార్చడం వలన, అధికంగా చమట పట్టడం వలన, అపరిశుభ్రతవలన మరియు యుక్తవయస్సులో జరిగే మార్పుల వలన అయి ఉండవచ్చు.

click the below link for English version

No more smelly armpits 

చంకలో దుర్వాసనకు కొన్ని వంటింటి చిట్కాలు:

1.టమాటో రసం:

Source : Big Oven

టొమాటోలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మరియు క్రిమినాశక లక్షణాలు బ్యాక్టీరియాను దూరం చేసి దుర్వాసనను పోగొడతాయి. అందువలన టమాటో గుజ్జును చంకభాగంలో రాసి ఒక 10-15 నిమిషాలు ఉంచడం వలన శరీర దుర్వాసన దూరం అవుతుంది.

 

2.వెనిగర్/ఎసివి:

 

Source : Rescom Mold Removal

వెనిగర్ మరియు ఎసివి రెండు కూడా శరీర దుర్వాసనను తొలిగించడంలో ఎంతో తోడ్పడతాయి. ఈ వెనిగర్ మరియు ఎసివి పిహెచ్ విలువలను నియంత్రణలో ఉంచి దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను దూరంచేస్తుంది. వెనిగర్/ఎసివితో పాటు మంచినీటిని సమాన మొత్తంలో తీస్కుని దూదితో సన్నని పొరల రాసుకోవాలి. ఒక 15-20 నిమిషాలు ఉంచి కడిగేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

3.బేకింగ్ సోడా:

Source : Today Show

బేకింగ్ సోడాలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాల వలన శరీర దుర్వాసనను తొలిగించడంలో ఎంతో సహాయపడుతుంది.ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాకు కొంచం నిమ్మరసం కలిపి పేస్ట్ లాగ చేస్కుని ఈ పేస్టును చంకభాగంలో రాసుకుని ఆరేంతవరకు ఉంచుకోవాలి. ఒక 3-5 నిమిషాల తరువాత నీటితో సుబ్రంచేస్కొవచ్చు.

 

4.నిమ్మరసం:

Source : New Hope Network

వెనిగర్ వల్ల చర్మంలో పీహెచ్ విలువ నియంత్రణలో ఉన్నట్టే నిమ్మరసంలో ఉండే లక్షణాలు కూడా శరీరాదుర్వాసనను దూరంచేయడంలో సహాయపడుతుంది. సగం నిమ్మచెక్కను పిండి దూదితో నిమ్మరసాన్ని సన్నని పూతలా రాసుకోవచ్చు. సున్నితమైన చర్మం కలిగినవారు నిమ్మరసాన్ని కొన్ని నీళ్ళల్లో కలిపి రాసుకోవచ్చు.

 

5.గ్రీన్ టీ:

Source : Marketing91

గ్రీన్ టీలో అధికంగా ఉండే డిటాక్స్ లక్షణాలు శరీర దుర్వాసనను తొలిగించడంలో ఎంతో సహాయపడతాయి. నీటిలో ఉడకపెట్టిన తరువాత వచ్చే గ్రీన్ టీ సారాన్ని చంకబాగంలో రాసుకుని ఆరిన తరువాత కడిగేసుకోవాలి.

**నోట్: శరీర దుర్వాసనకు మరికొన్ని ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావొచ్చు. అందువలన తీవ్రతను బట్టి చర్మవ్యాధి నిపుణుడను సంప్రదించడం మంచిది.
సున్నితమైన చర్మం కలవారు ఏదైనా రాసుకునే ముందు పాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.

 

 

 

 

Leave a Comment