వ్యర్ధపదార్ధాలలో ఔషధగుణాలు
విశ్వంలో ప్రకృతిలో మనకు లభ్యమయ్యే వ్యర్ధపదార్ధాలుగా భావించబడుతున్న పదార్ధాలలో కూడా సృష్టికర్త ఆపారమైన, అత్యంత శక్తివంతమైన రసాయన అంశాలను, ఔషధశక్తులను, ఔషధగుణాలను నిక్షిప్తకరించి మన ఆరోగ్య పరిరక్షణకు ప్రకృతి ద్వారా ప్రసాదించాడు.

ఈ నేపథ్యంలో మనచుట్టూ ఉన్న, వ్యర్ధపదార్ధాలుగా మనం భావిస్తున్న అనేకరకమైన పదార్ధాలు మన ఆరోగ్య పరిరక్షణకు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.
For English version click the below link
అరటి:

1 . చర్మ రోగాలు: ముక్కలుగా కత్తిరించిన అరటిపండు తొక్కలు, కొబ్బరి నూనె సమానంగా తీసుకుని సన్నని మంటపైన తొక్కలు నల్లగా అయ్యేంతవరకు నూనెలో మరిగించి, దించి, చల్లార్చి, వడగట్టి నిల్వ ఉంచుకుని పై పూతను ముందుగా లేపనం చేస్తుంటే తామరలాంటి చర్మవ్యాధులకు, కాళీ పగుళ్లు తగ్గిపోతాయి.
2 . మొటిమలు, దద్దుర్లకు: అరటిపండు తొక్క లోపలివైపున ఉన్న తెల్లని పదార్ధంతో ఆయా ప్రాంతాల్లో రుద్దుతుంటే మొటిమలు, దద్దుర్లు లాంటి సమస్యలేకాక పులిపిర్లు, నోటిపూత లాంటివి కూడా తగ్గిపోతాయి.
3 . తెల్లమచ్చలు: ఎండిన అరటి ఆకులను కాల్చి, బూడిద చేసి, చల్లార్చి, జల్లించిన పొడి స్వచ్ఛమైన పసుపు పొడి సమానంగా కలిపి ఉంచుకుని రోజు రెండు పూటలా పూటకు ఒక గ్రాము ఓషధాన్ని తగినంత తేనెతో కలిపి సేవిస్తుంటే తెల్లమచ్చలు లేదా తెల్లపొడ లేదా తెల్లబోల్లి అని చెప్పబడే వ్యాధి త్వరగా తగ్గిపోతుంది.
4 . దగ్గుకు: ఒక చిటికెడు అరటి ఆకు బూడిదను తగినంత తేనెతో కలిపి చిన్న పిల్లలకు, ఒక గ్రాము బూడిదను తగినంత తేనెతో కలిపి పేదలకు ఇస్తుంటే వివిధ రకాల దగ్గులు చాలా త్వరగా తగ్గిపోతాయి.
కమల పళ్ళ తొక్కలు :

1 . పెదాల నలుపు తగ్గేందుకు: ఎండిన కమలా తొక్కల్ని మెత్తగా చూర్ణించి, జల్లించి ఉంచుకుని రోజు ఒకసారి తగినంత పొడిలో తగినంత తేనె కలిపి పై పూత ముందుగా లేపనం చేస్తుంటే త్వరగా సమస్య తగ్గుతుంది.
మామిడి జీడీ:

1 . చుండ్రు సమస్య తగ్గేందుకు : వారంలో రెండుసార్లు తగినంత మామిడి జీడీ పొడిలో తగినంత నీళ్లు చేర్చి పేస్టులా చేసి తలకంతా పట్టించి అరగంటాగి కుంకుడు లేదా శీకాకాయతో తలస్నానం చేస్తుంటే చాల చక్కటి ఫలితాలు కలుగుతాయి.
2 . పైల్స్: మామిడి జీడిని ముక్కలుగా చేసి ఎండించి చేసిన చూర్ణాన్ని రోజు ఉదయం, సాయంత్రం పూటకు 1 – 2 గ్రాముల వంతున 100 మీ.లీ తాజా మజ్జిగలో కలిపి సేవిస్తుంటే రక్తస్రావంతో కూడిన మొలల వ్యాధి తగ్గుతుంది.
3 . దగ్గు, ఉబ్బసం, కడుపులో మంట: మామిడి జీడీ పొడిని పూటకు 1-2 గ్రాముల వంతున రెండు పూటలా తగినంత పంచదార కలిపి సేవిస్తుంటే కడుపులో మంట , తగినంత తేనెతో కలిపి సేవిస్తుంటే వివిధ రకాల దగ్గులు తగ్గుతాయి. అంతేకాదు ఈ ఔషధ సేవన వల్ల స్త్రీల తెల్లబట్ట సమస్య కూడా తగ్గిపోతుంది.
కొబ్బరి పీచు:

1 . దీర్ఘకాలిక విరేచనాలు తగ్గేందుకు: రోజు రెండుపూటలా పూటకు 200 మీ.లీ నీటిలో కొబ్బరికాయను వలిచేటప్పుడు రాలిని పొత్తును 15 గ్రాములు కలిపి 100 మీ.లీ. నీరు మిగిలేలా మరిగించి, చల్లార్చి, వడగట్టి సేవిస్తుండాలి.
2 . కడుపులో మంటకు: కొబ్బరి పీచును కాల్చి బూడిద చేసి, చల్లార్చి, జల్లించి ఉంచుకుని ఉదయం, సాయంత్రం పూటకు ఒక గ్రాము బూడిదను 200 మీ.లీ. తాజా మజిగ్గలో కలిపి సీవించాలి.
3 . ఎగ్జిమా , తామరలాంటి చర్మవ్యాధులకు: కొబ్బరి చిప్పలని బాగా ఎండించి ముక్కలుగా చేసి కాల్చి బూడిద చేసి, చల్లార్చి, జల్లించి ఉంచుకుని రోజు ఒకసారి తగినంత బూడిదలో తగినంత కొబ్బరినూనె చేర్చి పల్చటి పేస్టులా చేసి లేపనం చేస్తుంటే ఎగ్జిమా , తామరలాంటి చర్మవ్యాధులు త్వరగా తగ్గిపోతాయి.
💯💯 సూపర్ అండి మెసేజ్ 💯💯
Excellent message