అమ్మలాంటి నిమ్మ
చిన్నపిల్లలకు ఎలాంటి సమస్య వాచీని తల్లిదగ్గర ఇదొక చిట్కా ఉంటూనే ఉంటుంది. అటువంటిదే నిమ్మ కూడా. ఎన్నో ఏళ్ళనుండి నిమ్మకాయలను, నిమ్మరసాన్ని అనేక విధాలుగా ఉపయోగించేవారు. నిమ్మకాయలోని ఔషధ గుణాలు ఏవిధంగా సద్వినియోగం చేసుకుని చక్కటి ఫలితాలు పొందవచ్చో తెలుసుకుందాం.

ముఖంపైన నల్లటి మచ్చలు, నలుపుదనం తగ్గేందుకు: రోజులో ఒకసారి తగినంత నిమ్మపండు రసంలో కాచిన పాలను కలిపి ముఖంపైన పట్టించి కొద్దిసేపు సున్నితంగా మర్దన చేసి అరగంట ఆగి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల త్వరగా సమస్య తగ్గుతుంది.

ఆకలిని పెంచేందుకు: రోజులో ఒకసారి ఆహారాన్ని అరగంట ముందు 100 మీ.లి. నీటిలో అరా టీస్పూన్ బెల్లం పొడిని కరిగించి అందులో అరబద్ధ నిమ్మరసం, ఒక గ్రాము ఉప్పు, ఒక గ్రాము జీలకర్రపొడి కలిపి సేవిస్తుంటే జీర్ణ రసల ఉత్పత్తి బాగా జరిగి జఠరాగ్ని చైతన్యం అయ్యి ఆకలి బాగా అవుతుంది.

ఒంటి దురదలు తగ్గటానికి: రోజులో ఒకసారి తగినంత నిమ్మరసంలో తగినంత కొబ్బరినూనె కలిపి ఒంటికి రాసుకుంటూ ఉండాలి.

కేశాలు రాలకుండా ఉండటానికి: 100 మీ.లి నిమ్మరసాన్ని అరకిలో కొబ్బరినూనెలో కలిపి సన్ననిమంటపై నూనె మాత్రం మిగిలేటట్లు మరిగించి, దించి, చల్లార్చి, వడగట్టి నిల్వ ఉంచుకుని రోజు తలకు రాస్తూ ఉంటె వెంట్రుకలు దృఢత్వాన్ని సంతరించుకుని రాలకుండా ఉంటాయి. చుండ్రు దరిచేరదు. కేశాలు మృదువుగా, కోమలంగా తయారు అయ్యి మంచి నిగారింపును సంతరించుకుంటాయి.

అధికబరువు తగ్గేందుకు: మిరియాల పొడి, ధనియాలు వేయించి చేసినపొడి, జీలకర్రను వేయించి చేసినపొడి ఒక్కొక్కటి 40 గ్రాములు ఆయుర్వేద విక్రయశాలల్లో లభించే సైంధవలవణ పొడి 10 గ్రాములు కలిపి ఉంచుకుని రోజు ఒకటి లేదా రెండుసార్లు పూటకు 200 మీ.లి. గోరువెచ్చని నీటిలో 2 – 3 గ్రాములు ఈ పొడిని మరియు 10 మీ.లి. నిమ్మరసాన్ని కలిపి సేవిస్తూ, చక్కటి వ్యాయామం చేస్తూ ఆహారానియమాలు పాటిస్తే టిరాగ చక్కటి పరిష్కారం దొరుకుతుంది.

కిడ్నీలో రాళ్ళూ కరిగేందుకు: రోజు ఉదయం, సాయంత్రం పూటకు 200 మీ.లి. నీటిలో ఒక గ్రాము సైంధవలవణం పొడి, 5 – 10 మీ.లి. నిమ్మరసం కలిపి సేవిస్తుంటే మూత్ర వ్యవస్థలోని రాళ్ళూ కరిగిపోతాయి.

చిగుళ్ల నొప్పి , పంటి నొప్పి తగ్గేందుకు: తగినంత లవంగాల పొడిలో తగినంత నిమ్మరసం కలిపి పట్టిస్తే వెంటనే ఆ బాధ తగ్గుతుంది.

తేలుకాటుకు: తగినంత నిమ్మరసంలో తగినంత ఉప్పు వేసి నూరి పేస్టులా చేసి లేపనం చేస్తే వెంటనే తెలు కాటు వల్ల కలిగే బాధ , నొప్పి, పోటు, నలుపు, మంట తగ్గుతాయి.

నోటి దుర్వాసనకు: 10 మీ.లి. నిమ్మరసాన్ని 50 మీ.లి. పన్నిటిలో (రోజ్ వాటర్) కలిపి రోజు ఒకటి రెండు సార్లు కొద్దిసేపు పుక్కిలిస్తూ ఉంటె మంచి ఫలితం ఉంటుంది.

చెవిపోటుకు: విత్తనాలు తొలిగించిన అరబద్ధ నిమ్మపండుపై కాస్త ఉప్పు అద్ది వేడి చేసి 2 , 3 చుక్కలరసం చెవిలో పిండితే తక్షణమే చెవినొప్పినుంచి ఉపశమనం కలుగుతుంది

దంతాలు మెరిసేందుకు: నిమ్మతొక్కలను ఎండించి చేసిన పొడి ఉప్పు సమానంగా కలిపి ఉంచుకుని దంతధావన చూర్ణంగా ఉపయోగించడం వల్ల దంతాలపై గార తొలిగి దంతాలు ఆకర్షణీయంగా తయారు అవుతాయి.
