నువ్వులతో నిండు నూరేళ్లు
మన దైనిందనజీవితంలో ప్రతినిత్యం వివిధ రకాల ఆహారపదార్ధాల వంటకాల తయారీలో నువ్వులను ఉపయోగిస్తుంటాం. నువ్వులపొడి, నువ్వుల పచ్చడి, నువ్వచిమ్మిలి వంటి రుచికరమైన పదార్ధాలను ఈ నువ్వులతో తయారు చేస్తారు.

నువ్వులు శరీర పోషణకు, ఆరోగ్యపరిరక్షణకు ఉపయోగపడతాయి. నువ్వుల్ని సంస్కృతంలో తిలలు అంటారు. ఇంగ్లీష్లో “సేసమేసీడ్స్” లేదా “టిల్ సీడ్స్” లేదా “జింజెల్లీసీడ్స్” అంటారు. శాస్త్రీయంగా “సెస్సమోముమ్ ఇండికమ్” అనే పేరుతో వ్యవహరిస్తారు.
నువ్వుల్లో తెల్లనువ్వులు , నల్లనువ్వులు , గోధుమరంగు నువ్వులు అని మూడు రకాల నువ్వులు లభ్యం అవుతున్నప్పటికీ దైవకార్యక్రమాలకు మరియు ఔషధతయారీలో నల్లనువ్వులనే ఉపయోగిస్తారు. ఔషదంగా నువ్వులను వాడుకునేటపుడు వాటిని వేయించి వాడుకోవాలి. ఈ నువ్వుల నుండి నువ్వుల నూనె కూడా తయారుచేస్తారు. ప్రకృతిలోని అన్ని రకాల నూనెల్లో నువ్వులనూనెను మించిన నూనె మారేదీలేదు కాబట్టే దీనికి మంచినూనె అని కూడా పేరు. దైవారాధనలో ఇది అత్యంత శ్రేష్ఠమైన తైలం. ఈ నువ్వుల్ని ఎలాంటి వ్యాధులకు ఎలా వాడుకోవచ్చో తెలుసుకుందాం.
click the below link for english version
1.మలబద్దకం:
100 గ్రాముల నల్ల నువ్వుల్లో 100 గ్రాముల బెల్లం కలిపి దంచి ఒక సీసాలో నిల్వ ఉంచుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడు ఉసిరికాయంత తిని, ఆ తరువాత 100 మి.లి పాలు లేదా గోరువెచ్చని నీళ్లు తాగాలి. ఇలా చేయడం వల్ల రక్తహీనత కూడా తగ్గుతుంది. చక్కరవ్యాధిగ్రస్థులు బెల్లం లేకుండా కేవలం 5 గ్రాముల నల్లనువ్వులపొడిని 100మి.లి వేడి పాలల్లో కలిపి రాత్రిపూట త్రాగుతుండాలి.

2.అతిమూత్రవ్యాధి:
నువ్వులచూర్ణం, వామును వేయించి చేసిన చూర్ణం, వరిపేలాలచూర్ణం ఈ మూడింటిని ఒక్కొక్కటిగా 50 గ్రా చొప్పున తీసుకుని అన్నింటిని కలిపి నిల్వ ఉంచుకుని ఉదయం, సాయంత్రం పూటకు ఒక టీ స్పూన్ వంతున 100మి.లి నీటిలో కలుపుకుని త్రాగుతుండాలి. ఇదే ఔషధాన్ని రోజుకు రెండుపూటలా వయస్సును బట్టి పావు టీస్పూన్ నుండి అరటీస్పూన్ వరకు వాడుతుంటే పిల్లల్లో పడకలో మూత్రవిసర్జన సమస్య తగ్గుతుంది.

3.కీళ్ళనొప్పులకు:
నువ్వులచూర్ణం, సొంటిచూర్ణం సమానంగా కలిపి ఉంచుకుని రెండుపూటలా పూటకు అరటీస్పూన్ (2-3గ్రా) తేనేతో కలిపి వాడాలి. చక్కెరవ్యాధి ఉన్నవాళ్లు 100మి.లి పలు లేదా నీళ్లు కలిపి తాగాలి.

4.నోటిపూతకు:
నువ్వులచూర్ణం, పటికబెల్లంపొడి ఒక్కొక్కటి 50 గ్రా చొప్పున తీసుకుని రెండిటిని కలిపి ఒక సీసాలో నిల్వ ఉంచుకోవాలి. రెండుపూటలా అరటీస్పూన్ పొడిని ఒక టీస్పూన్ వెన్నతో కలిపి సేవిస్తుండాలి. నువ్వులో కాల్షియమ్, ఐరన్ , ప్రోటీన్, ఫాస్పారోస్లాంటి ఎన్నో పోషకవిలువలు ఉంటాయి. కాబట్టి పోషికాహారలోపల వల్ల ఒకే నోటిపూతలకు చక్కటి ఫలితం ఉంటుంది.

5.మొటిమలు తగ్గేందుకు:
నువ్వులచూర్ణం, తెల్లఆవాలుచూర్ణం ఆయుర్వేద ఔషధవిక్రయశాలలో లభించే యావక్షారమును ఒక్కొక్కటిగా 10 గ్రా చొప్పున కలిపి ఉంచుకుని రోజుకు ఒకసారి తగినంత పొడిలో తగినన్ని ఆవుపాలు కలిపి పేస్టులా చేసి మొటిమలపై లేపనం చెయ్యాలి.

6.మూర్ఛవ్యాధికి:
నల్లనువ్వులు వేయించి చేసిన పొడి 100గ్రా తీసుకుని అందులో 100 గ్రా వెల్లుల్లిరసం కలిపి మెత్తగా నూరి బఠాణిగింజంత మాత్రలు చేసి ఆరించిపెట్టి పూటకు ఒక మాత్ర చొప్పున 2-3 పూటలు సేవిస్తూ ఉండాలి.

7.సుఖనిద్రకు:
నువ్వులనూనెను బాగా వేడి చేసి దించి నాల్గవవంతు కర్పూరం కలిపి మూతపెట్టి చల్లారిన తరువాత నిల్వవుంచుకుని రోజుకు ఒకసారి అరికాళ్లకు మర్దన చేస్తుంటే చక్కటి నిద్రపడుతుంది.

8.స్త్రీలకు బాధనివారినిగా:
100 గ్రా నువ్వుల పొడి, 100 గ్రా వాముని వేయించి చేసిన చూర్ణం, 100 గ్రా మెంతుపొడులను కలిపి ఒక సీసాలో నిల్వ ఉంచుకోవాలి. 200 మి.లినీళ్ళల్లో (ఒక టీస్పూన్) ఈ పై మిశ్రమాన్ని వేసి కొద్దిసేపు నానబెట్టి 50మి.లి నీళ్లు మిగిలేలా సన్నని మంటపై మరిగించి , దించి చల్లార్చి వడగట్టి సేవించాలి. ఇలా రోజుకు రెండుసార్లు చెయ్యాలి. ఈ ఔషధాన్ని బహిష్ఠకు 20 రోజుల ముందు మొదలుపెట్టి బహిష్ఠు అయిన తరువాత ఆపేయాలి. ఇలా కొన్ని నెలలు చెయ్యాలి.

ప్రతినెలా బహిష్ఠకు రెండు, మూడు రోజుల ముందు నుండి రోజుకు రెండు మూడుసార్లు టీస్పూన్ నువ్వులపొడిని 50మి.లి నీటిలో కలిపి సేవిస్తుండాలి. గర్భాశయకండరాలను ఎక్కువగా ప్రేరేపించే నైజం ఈ నువ్వులకు ఉండటంవల్ల గర్భవతులు వాడరాదు. ఈ నువ్వులను చలికాలంలో ఎక్కువ ప్రమాణంలోను, వేసవికాలంలో తక్కువ ప్రమాణంలోను , అట్లే వేడిశరీరతత్వం ఉన్నవారు కూడా తక్కువ ప్రమాణంలో వాడితే బహిష్ఠ నొప్పి ఉపశమిస్తుంది.
నల్లనువ్వులు 10గ్రా, పాతబెల్లం 20గ్రా , ఒంటిరెక్కమందారపూవుళ్లు -4 తీసుకుని వీటి అన్నింటిని కలిపి మెత్తగా నూరి సీసాలో నిల్వ ఉంచుకుని ఉదయం, సాయంత్రం కుంకుడుకాయ అంత పరిమాణం తింటూ ఉంటె ఆగిపోయిన బహిష్ఠు మళ్ళీ వస్తుంది.
నువ్వులనూనెలో లినోలిన్ఆమ్లాలు ఉంటాయి. సేసమిన్ , సేసమోరిన్ అనే రసాయనప్రభావం వలన చాలాకాలం రంగుమారకుండా, చెడువాసనరాకుండా , విటమిన్లు నష్టపోకుండా ఉంటుంది. అందుకే నిల్వఉరగాయలతయారీలో నువ్వులనూనెను ఎక్కువగా వాడతారు.