మీరు కూడా నిద్రలో ఉలిక్కిపడుతున్నారా?
నిద్రలో ఉలిక్కిపడటం సర్వ సాధారణం. వీటినే ఆంగ్లంలో ట్విచ్చింగ్ లేదా హిప్నిక్ జెర్క్స్ అని అంటారు. ఈ ట్విచ్చింగుకు ప్రత్యేకమైన కారణాలు లేకపోయినా మన రోజువారీ అలవాటుల వల్ల వచ్చే కలిగే అవకాశాలు ఉన్నాయి. చిన్నగా కదలడం నుండి మనిషి ఉలిక్కిపడి లేచే వరకు అవకాశాలు ఉన్నాయి.

అయితే వీటి వెనుక ఉండే కారణాలు ఏమయ్యి ఉండవొచ్చు అంటారు? అంతే కాకుండా హిప్నిక్ జెర్క్స్ యొక్క లక్షణాలు కూడా చూసేద్దాం.
పలు హిప్నిక్ జెర్క్స్ లక్షణాలు:
- కండరాలు అదరటం
- పైన నుండి జారీ పడుతున్నట్టు చలానాలు
- ఆకస్మికంగా ఉలిక్కిపడటం
- హృదయం వేగంగా కొట్టుకోవడం లేదా చమట పట్టడం
ట్విచ్చింగ్గుకు గల కారణాలు:
- నిద్ర రుగ్మతులు: సరైన నిద్ర అలవాట్లు మరియు నిద్రలేమి వంటి సమస్యల వల్ల నిద్రలో ఎక్కువగా ఉలిక్కిపడి అవకాశాలు ఉన్నాయి.
- వ్యాయామం: వ్యాయామం శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. దాని వల్ల శరీరం విశ్రాంతి లేకుండా నిద్ర పట్టడం కష్టంగా మారి ట్విచ్చింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
- కెఫిన్ లేదా నికోటిన్: కెఫీన్ మరియు నికోటిన్ వంటి స్టిమ్యులంట్లు తీసుకోవడం వల్ల శరీరం ఉత్తేజవంతంగా పని చేసి నిద్రకు ఉపక్రమించడం కష్టం అవుతుంది.
- అధిక ఒత్తిడి మరియు ఆందోళన: అధిక ఒత్తిడి మరియు ఆందోళన ఉండటం వలన మెదదుకు విశ్రాంతి ఉండదు.వీటివల్ల నిద్రలో ఉలిక్కిపడే లక్షణాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ముందుజాగ్రత్తలు:
- సరైన నిద్ర అలవాట్లు: రోజు ఒకే సమయానికి పదుకునే అలవాటు చేసుకోవడం మంచిది. అంతేకాకుండా నిద్రపోయే ఒక అరగంట ముందు నుండి సెల్ల్ఫోన్ వంటి గాడ్జెట్లు దూరంగా పెట్టడం ఉత్తమం.
Source : Allure - ధ్యానం లేక శ్వాస వ్యాయామం: పడుకునే ముందు ధ్యానం మరియు శ్వాస వ్యాయామం వంటివి చేయడం వలన మనసు మెదడు రెండు ప్రశాంతంగా ఉంటాయి. దీనివల్ల మనిషి త్వరగా నిద్రలోకి జారుకునే అవకాశాలు ఎక్కువ.
Source : Shape Magazine - ఉతేజకాలు మానేయాలి: పడుకునే కొంత సమయం ముందు శరీరాన్ని ఉతేజపరిచే కెఫిన్ మరియు నికోటిన్ వంటివి తీసుకోవడం మానేయాలి. దేనివల్ల మెదడు ఉతేజపడకుండా ప్రశాంతంగా ఉంది నిద్ర బాగా పడుతుంది.
Source : Hello Sunday Morning - వ్యాయమ సమయం: ఆలస్యం లేకుండా సాయంకాల సమయం వరకు వ్యాయామం పూర్తిచేసుకోవడం వల్ల శరీరానికి విశ్రాంతి దొరుకుతుంది. కావున పదుకునే సమయానికి దగ్గరగ కాకుండా కాస్త ముందే వ్యాయామాన్ని పూర్తి చేసుకోవాలి. అంతేకాకుండా రాత్రిపూట ఎక్కువ తీవ్రత లేని యోగ వంటివి చేయడం మంచిది.
Source : MapMyRun Blog