అవాంఛిత రోమాలకు ఇక గుడ్ బై!!

by

                అవాంఛిత రోమాలకు ఇక గుడ్ బై!!

అవాంఛిత రోమాలు లేక అన్‌వాంటెడ్ హెయిర్‌ అనేది ఎంతో మందిని ఇబ్బంది పెట్టె విషయం. కానీ ఈ అవాంఛిత రోమాలు పెరుగుటకు అనేక కారణాలు ఉన్నప్పటికీ ముఖ్యమైన కారణం మాత్రం ఆండ్రోజెన్ మరియు టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్ స్థాయిలు అధికంగా ఉండటమే అంటారు నిపుణులు. అయితే ఈ అన్‌వాంటెడ్ హెయిర్‌ అనేది హార్మోన్ల అసమతుల్యత లేదా జెనెటిక్స్ వాళ్ళ కూడా ఒకే అవకాశాలు ఉన్నాయి. 

Source : Hair Free Hair Remover

కానీ మన ఇంట్లోనే అన్‌వాంటెడ్ హెయిర్‌ అనేది ఇబ్బంది పెట్టకుండ మనం ఎంచేయొచ్చో చూద్దాం: 

ఓట్మీల్ మరియు అరటిపండు: రెండు చెంచాల ఒట్స్ లో ఒక అరటిపండును కలిపి పేస్ట్ చేసి, ఆ పేస్టును రాసి వృథాకారంలో మృదువుగా మర్దన చేయాలి. ఒక 15 – 20 నిముషాలు ఉంచి ఆరిన తరువాత కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. 

Source: Elemental Custard

పంచదార మరియు నిమ్మరసం: రెండు చెంచాల పంచదారకు తగినంత నిమ్మరసం నీళ్లు కలిపి చిక్కగా అయ్యేవరకు మరిగించాలి. ఈ మిశ్రమాన్ని గోరువెచ్చగా కానీ చల్లారిన తరువాత కానీ రాసి 10 – 15 నిమిషాల పాటు మర్దన చెయ్యాలి. ఇలా చెయ్యడం వలన అవాంఛిత రోమాలు తగ్గుతాయి. 

Source : The Spruce Eats

కోడిగుడ్డు తెల్లసోనా మరియు మొక్కజొన్న గంజి: కోడిగుడ్డు తెల్లసొనకు మొక్కజొన్న గంజి మరియు కాస్తంత పంచదార కలపాలి. దీనిని చర్మానికి రాసి ఆరేవరకు ఉంచాలి. ఆరినతరువాత ఒక వైపు కొద్దీగ వదులుగ చేసి వ్యతిరేక దిశగా లాగాలి. దీనివల్ల అధికంగా ఉన్న వెంట్రుకలు అన్ని ఊడిపోతాయి.

 

నిమ్మరసం మరియు తేనే: తేనే, నిమ్మరసం మరియు కొద్దిగ్గా పంచదారను కలిపి జిగురుగా మారేంత వరకు మరగనివ్వాలి. దీనిని సహజమైన మైనం లేదా చర్మానికి వాడేటటువంటి వాక్స్ లాగా వాడొచ్చు. 

Source : Purebread

పసుపు మరియు బొప్పాయి: బొప్పాయిని మెత్తగా పేస్టులా చేసి దానికి చిటికెడంత పసుపు కలిపి దానిని చర్మానికి రాసి ఆరేంతవరకు ఉంచి సున్నితంగా కడిగేసుకోవాలి. 

Source : girlstyle.com

పాలు మరియు జెలటిన్: అవాంఛిత రోమాలకు ఈ చిట్కా ఎంతో బాగ పనిచేస్తుంది. కాస్తంత జెలటిన్కు పాలు మరియు నిమ్మరసం కలపి వేడి చెయ్యాలి. మిశ్రమం దగ్గరపడేంత వరకు ఉంచి చల్లబడ్డాక ఫేస్ ప్యాక్ వలే వేసుకుని తీసేయొచ్చు. 

Source : Trend Crown

అవాంఛిత రోమాలు తొలిగించుటకు మరికొన్న చికిత్సలు పద్ధతులు: 

  • షేవింగ్
  • డిపిలేటరీ క్రీములు(నొప్పి లేకుండా వెంట్రుకలను తొలిగించడానికి వాడే క్రీము)
  • వాక్సింగ్
  • లేజర్ ట్రీట్మెంట్ 
  • ఎలెక్ట్రోలైసిస్ (సూదులను వాడి వెంట్రుకుల కుదుళ్లను తొలిగించే చికిత్స) 
  • యాంటీ ఆండ్రోజెన్లు
  • మందులు వాడటం 
  • థ్రెడింగ్

**నోట్: అవాంఛిత రోమాలు లేదా అన్‌వాంటెడ్ హెయిర్‌ పెరుగుటకు అనేక కారణాలు ఉండటం చేత డాక్టర్ను సంప్రదించి నిర్ణయం తీసుకోవటం మంచిది. 

Leave a Comment