పొట్ట చుట్టూ అధిక కొవ్వును తగ్గించడం ఎలా?
మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, ఇతరేతర కారణాల వల్ల ఒంట్లో కొవ్వు పేరుకుపోతుంది. అధికపొట్ట అందరికి ఎంతో ఇబ్బందిగా మారుతుంది. ఇందుకోసం రోజు వ్యాయామం చేస్తున్నప్పటికీ ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా ముఖ్యమే అంటున్నారు నిపుణులు.

మిల్లెట్స్: కొర్రలు, ఓట్స్, జొన్నలు, పెసలు, ఉలవలు, కందులు, నీటిశాతం ఎక్కువగా ఉండే బీరకాయ, అనప, పొట్లకాయ వంటి కూరలు తీసుకోవాలి.

పగటి నిద్ర: పగటి నిద్రకు దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండ వ్యాయామం చెయ్యాలి. పొట్ట తగ్గించుకునేందుకు కాలేయం పనితీరును పెంచే ఆసనాలు ఉంటాయి. వాటిని చెయ్యడం వల్ల కాలేయం పనితీరు పెరిగి కొవ్వు తగ్గుతుంది.

మితంగా భోజనం: అర టీస్పూన్ మెంతి పొడిని నీళ్ళల్లో కలిపి రాత్రిపూట వందగ్రాముల వారిపేలాలతో కలిపి తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆహారంలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉండేటట్లు చూసుకోవడం రకరకాల పిండి పదార్దాలతో బయట చేసే పించి వంటలు తినకుండా జాగ్రత్త పడాలి. మితంగా భోజనం తినాలి.

మంచినీరు: భోజనానికి ౩౦ నిమిషాల ముందు నీళ్ళుబాగా తాగండి. ఆకలి ప్రభావం అంతగా తెలియదు. భోజనానికి రెండు గంటల తర్వాత కనీసం ౩౦నిమిషాలకు ఒక్కసారి నీళ్లు తాగండి.

ఉడకపెట్టిన కూరగాయలు: రోజులో తక్కువ ప్రమాణంలో ఎక్కువ సార్లు తినండి.కప్పుడు అన్నంతో పాటు ఉడకపెట్టిన కూరగాయలు, మొలకలు ఉండేలా చూసుకోండి. రాత్రి మాత్రం ఒక్క చపాతీ చాలు. ఆకలేస్తే ఏ పచ్చి క్యారెట్టో, ఆపిల్ పండో తినండి.

తేనే: కప్పు గోరు వెచ్చని నీటిలో స్పూన్ తేనే కలుపుకుని పరగడుపున తాగాలి. రోజులో కూడా ఎక్కువగా నీటిని తాగాలి. అప్పుడు పొట్టలోని మలినాలు, కొవ్వు కరిగి బయటకు విసర్జితమవుతాయి.

గ్రీన్ టీ: సహజంగా లభించే గ్రీన్ టీని ఉదయం పూట సేవించాలి. దానిమ్మ జ్యూస్ తప్ప మిగతా అన్ని రకాల జ్యుక్యూలను తీసుకోవచ్చు. కాఫీ మాత్రం రోజుకు ఒక కప్పు మాత్రమే తీసుకోవాలి.

బార్లీ గింజలు: అధిక బరువును అరికట్టే ఆహార పదార్ధం బార్లీ. ఈ బార్ల్య్ గింజలు గంజి చేసుకుని తాగడం ద్వారా అధిక బరువును గణనీయంగా తగ్గించేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని బాగా తగ్గించేస్తుంది.
