మొటిమలు ఇక మాయం
ప్రపంచంలో ప్రతిఒక్కరిని ఏదొక సమయంలో మొటిమల సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. మొటిమల వల్ల ఎంతోమందిలో ఆత్మవిశ్వాసం కూడా నశిస్తుంది. అందువల్ల మొటిమలకు కారణం తెలుసుకుని సరైన చికిత్స తీసుకోవాలి. సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల మచ్చలు మరియు హైపర్పిగ్మెంటేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ.

కాబట్టి మొటిమల గురించి చాలామందికి తెలియని సత్యాలు తెలుసుకోవడం వల్ల సరైన చికిత్స సకాలంలో చేయించుకోగలం.
For english click the below link
ఒంట్లో వేడి వలన మొటిమలు పెరగవు: చాలామందికి ఒంట్లో వేడి వలన మొటిమలు పెరుగుతాయి అని విశ్వసిస్తారు. కానీ ఒంట్లో వేడి జ్వరం వలన, వ్యాయాయం వలన, థైరాయిడ్ సమస్యల వలన పెరిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఒంట్లో వేడి వలన మొటిమలు పెరగవు

ఫుడ్ డైరీ: చాలా అధ్యయనాలు మొటిమలకు ప్రధాన కారణం పాల ఉత్పత్తులు అని తేల్చారు. అందువలన ఒక ఫుడ్ డైరీ పెట్టుకుని తినే ఆహార పదార్ధాల లిస్ట్ రాసుకోవడం మంచిది. ఇలా రాసుకోవడం వల్ల ఏ ఆహార పదార్ధాలు చర్మానికి పడట్లేదో వెటివలన మొటిమలు అధికం అవుతున్నాయో మనకి తెలుస్తుంది. వాటిని మన రోజువారీ దినచర్యలో తొలిగించడం మంచిది.

ప్రేగు సమస్యలు: అతిసారం, ప్రేగు సమస్యలు, ఉబ్బరం వంటి సమస్యల వల్ల మొటిమలు, మచ్చలు వంటివి వచ్చే అవకాశాలు తక్కువ. కానీ అధిక ఒత్తిడి వలన మొటిమల పెరిగే అవకాశాలు ఎక్కువ.

ఫేషియల్ మసాజ్/ ముఖం మర్దన చేయడం: ఫేషియల్ మసాజ్లు ముఖం పైన మర్దన వల్లన మొటిమల సమస్య అధికమవుతుంది. వీటివలన సేబాషియస్ గ్రంథులు చైతన్యవంతం అయ్యి చర్మంపైన బ్రేక్అవుట్ లేదా మొటిమలు పెరిగే అవకాశాలు ఎక్కువ.

వంటింటి చిట్కాలతో జాగ్రత్త: వంటింటి చిట్కాలు అందరికి ఉత్తమ ఫలితాలు ఇస్తాయి అని ఎలాంటి అధ్యయనాలలో నిరూపించబడలేదు.
ఒకరోజు పసుపు, మరొకరోజు మీగడ, దాని తరువాత ముల్తాన్ మట్టి వంటివి మార్చి రాయడం వలన చర్మం మరింత సున్నితంగా మారుతుంది. అందువలన చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి అనుకూలంగా చెప్పినవి వాడటం మంచిది.

బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ మొటిమలకు ప్రారంభదశ: చర్మంపైన ఉండే మట్టి మలినాలు చర్మ రంధ్రాలలో పూడుకుపోయి బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్గ మారుతాయి. చాలామంది మాయిశ్చరైజర్ రాసుకోవడం వలన చర్మం మరింత జిడ్డుగ మారుతుంది అని అనుకుంటారు. కానీ చర్మానికి వాడే మందులవలన చర్మం మరింత సున్నితమవుతుంది. ఆ సున్నితత్వానికి ఒకే ఒక్క పరిష్కారం మాయిశ్చరైజర్ రాసుకోవడమే. ఈ మాయిశ్చరైజర్లు కూడా చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి వాడటం మంచిది.

మొటిమల సమస్య యువతకె కాకుండా మధ్యవయసు వారికీకూడా ఉంటుంది: యువతతో పోల్చుకుంటే మధ్యవయసు వారిలో బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ సమస్యలు తక్కువగ ఉంటాయి. మధ్యవయసు వారికి మొటిమలు చీము, బంప్స్ రూపంలో వాస్తు ఉంటాయి.

నాన్-కామెడోజెనిక్ ఉత్పత్తులు వాడాలి: నాన్-కామెడోజెనిక్ ఉత్పత్తులు వాడటం వలన చర్మరంధ్రాలు మట్టి మలినాలతో పూడుకుపోకుండా ఉంటాయి. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోవడం వల్ల మొటిమల మచ్చలు, హైపర్పిగ్మెంటేషన్ వంటిసి తగ్గడానికి చాలా సమయం పట్టొచ్చు.

మొటిమలు ఉన్నప్పుడు చేయకూడనివి:
- మొటిమలను గిల్లడం వంటివి చేయకూడదు. ఇలా చెయ్యడం వల్ల బ్యాక్టీరియా చుట్టూ వ్యాపించే అవకాశాలు ఎక్కువ. ఇందువలన ఎప్పుడు చర్మవ్యాధి నిపుణులను సంప్రదించడం మంచిది.
- పడుకునే ముందు తలకు నూనె రాయడం మానేయండి. నూనె ఎప్పుడు తలస్నానం చేసే రెండు గంటల ముందు రాసుకోవడం మంచిది. పడుకునే ముందు రాసి వదిలేయడం వలన చర్మం జిడ్డుగ మారి మొటిమలు మరింత పెరిగే అవకాశాలు ఎక్కువ.
- జుట్టు నుదిటిపైన పడకుండా చూసుకోండి. జుట్టులో ఉండే మట్టి, చుండ్రు, జిడ్డు వంటివి నుదిటి పైన మొటిమలు ఎక్కువ అవ్వడానికి కారణమవుతుయి.
- స్క్రబ్ చేయొద్దు. మొటిమల సమస్య ఉన్నప్పుడు స్క్రబ్ వాడటం సమ్మతం కాదు. దీనివలన చుట్టూపక్కల చర్మానికి వ్యాప్తిచెందే అవకాశాలు ఉన్నాయి. ఎహ్హెచ్ఎహ్ మరియు బిహెచ్ఎహ్ వంటివి వాడటం మంచిది.
- వేడి నీళ్ళకి బదులు గోరువెచ్చని నీటిని వాడాలి. వేడి నీళ్లు చర్మాన్ని మరింత జిడ్డుగ మారుస్తాయి. అందువలన గోరువెచ్చని నీటిని వాడాలి.
మొటిమలకు పాటించవలసిన విషయాలు:
- మొటిమల సమస్య ఉన్నపుడు బెంజాయిల్ పెరాక్సైడ్, అజెలైక్ ఆసిడ్ మరియు సాలిసైక్లిక్ ఆసిడ్ ఉన్నటువంటి ఫేసెవాష్ను వాడాలి
- జుట్టుకి కండీషనర్ రాసిన తరువాత మొఖం కడుక్కోవాలి. కండీషనర్లో ఉండే ఏజెంట్లు చర్మ రంధ్రాలు పూడుకునేలా చేస్తాయి.