ఈ వంటింటి చిట్కాలతో దగ్గుకు ఇక సెలవు
ఏదైనా దుమ్ము దూళి తగిలినప్పుడు దగ్గు రావడం సహజం. కానీ కొన్ని సందర్భాల్లో కొంత మందికి 2-3 వారల వరకు దగ్గు తగ్గకుండా ఇబ్బంది పెడుతుంది. కొన్ని సందర్భాల్లో దగ్గుకు దుమ్ము, వైరల్ ఇన్ఫెక్షన్ల వంటి అనేక కారణాలు ఉండవచ్చు.

దగ్గుకు సులువైన వంటింటి చిట్కాలు:
తేన: తేనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాల వలన గొంతులో గరగరాను తగ్గిస్తుంది. కావున 2 టేబుల్ స్పూన్ల తేనెను గోరువెచ్చని నీటిలో కలుపుకోవచ్చు లేదా తేనెతో హెర్బల్ టీ చేస్కుని రోజుకి 1 లేదా 2 సార్లు తాగితే మంచి ఉపశమనం ఇస్తుంది.
అల్లం: అల్లం ఎన్నో సంవస్తరాల నుండి ఉన్నతమైన ఔషధంగ పరిగణించబడింది. దీనిలో ఉన్న యాంటీఇన్ఫ్లమేటరీ గుణాల వాళ్ళ దగ్గుతో పాటు గొంతు నొప్పి నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.అల్లం టీ లేదా అల్లాన్ని నూరి గోరువెచ్చని నీటిలో వేస్కుని తాగిన మంచి ఫలితాలు ఉంటాయి. రుచి కోసం కొద్దిగా తేనే ఇంకా నిమ్మరసం కూడా కలపొచ్చు.

ఆవిరి పట్టడం: వేడినీళ్లు ఆవిరి పట్టడం వలన గొంతులో చర్మానికి తేమ అంది మృదువుగా మారి నొప్పి చిరాకు దూరం అవుతాయి. వేడి నీటి ఆవిరిలో కోడిగా పసుపు కూడా వేసుకోవచ్చు.

హెర్బల్ టీస్/వేడి ద్రవ్యాలు: దగ్గు వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు వేడి ద్రవ్యాలు లేదా హెర్బల్ టీస్ తాగడం చేత కఫం వలన కలిగే ఇబ్బంది కొద్దిగా తగ్గుతుంది. ఇవి గొంతులో అడ్డుపడిన భావాన్ని తొలిగించి కొద్దిగా ఉపశమనాన్ని అందిస్తాయి.

ఉప్పు నీటితో పుక్కిలించడం: గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు వేసి పుక్కిలించడం వలన కఫం తగ్గి, ఉన్న వైరస్ మరియు బాక్టీరియా కూడా తొలిగిపోతాయి.

బ్రోమెలైన్ : బ్రోమెలైన్ అనేది అనస పండులో ఉండే ఒక ఎంజైమ్. దీనిలో ఉండే మ్యూకోలైటిక్ లక్షణాల వల్ల గొంతు నొప్పి , దగ్గు కాకుండా
శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుతాయి. ఇవి సప్లీమెంట్స్ రూపంలో కూడా డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు.

మార్ష్మల్లౌ రూట్: మార్ష్మల్లౌ రూట్లో ఉన్న దగ్గు అరుకుల వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. దీనిలో ఉన్న యాంటీఇన్ఫ్లమేటరీ గుణాల వాళ్ళ దగ్గు తగ్గుతుంది.

థైమ్: దీనినుండి వచ్చే నూనెలు గొంతునొప్పి, దగ్గు మరియు బ్రోన్కైటిస్ను కూడా తగ్గిస్తుంది. దీని ఆకుల్లో ఉండే ఫ్లేవనాయిడ్లు గొంతు నరాల్లో ఉండే వాపుని తగ్గించి, తేమని అందించి దగ్గు తగ్గేలా చేస్తుంది. ఆకుల పొడిని నీటిలో మరిగించి థైమ్ టీ చేస్కుని తాగొచ్చు.

పిప్పరమెంటు: పిప్పరమెంటులో ఉండే మెంథాల్ వలన వెంటనే ఉపశమనం కలుగుతుంది. దీనిలో ఉండే యాంటీవైరల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అడ్డును తొలిగించి ఉపశమనాన్ని కలిగిస్తాయి. పిప్పరమెంటు ఆయిల్ను డిఫ్యూజర్ సహాయంతో పీల్చొచ్చు.

దగ్గు బిళ్ళలు: దగ్గు బిళ్ళలు దగ్గు తీవ్రతను తగ్గించి రాత్రి నిద్రపట్టడానికి సహాయం చేస్తాయి. కానీ వీటిని అధికంగా వాడటం మంచిది కాదు.

**నోట్: ఒక ౨-త్రీ వారాలలో దగ్గు తగ్గనిచో, వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది.