క్యాబేజితో ఆరోగ్యం

by

                       క్యాబేజితో ఆరోగ్యం

మనం రోజువారీ తినే కూరగాయల్లో ప్రతి ఒక్క కూరగాయకు అనేక రకమైన ప్రత్యేకతలు ఉంటాయి. అలాగే క్యాబేజిలో కూడా ఎన్నో ఔషధ గుణాలు మరియు పోషక విలువలు ఉన్నాయి. కాబట్టి క్యాబేజీని రోజువారీ తినే వంటల్లో వాడడం వల్ల ఎటువండి లాభాలు ఉంటాయో చూద్దాం.

లాభాలు:

గుండె ఆరోగ్యానికి: క్యాబేజీలో ఉండే ఫైటోన్యూట్రియెంట్స్ గుండెకు సంబందించిన వ్యాధులు రాకుండా కాపాడుతాయి. అంతేకాకుండా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండెను ఆరోగ్యాంగా ఉంచుతుంది.

మలబద్దకాన్ని తగ్గిస్తుంది: క్యాబేజీలో ఉండే పీచుపదార్థం మలబద్దకాన్ని తగ్గిస్తుంది. మనం తినే ఆహారంలో
కారెట్, ఖీర, క్యాబేజి మొదలగు వంటివి తీసుకోవడం వల్ల అంతర్లీనంగా ఉండే సమస్య తొలిగి మలబద్దకం తగ్గుతుంది.

రోగనిరోధక శక్తి: క్యాబేజీలో అధికంగా ఉండే విటమిన్ సి వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. వేడి వల్ల విటమిన్ సి నశిస్తుంది. అందువలన కూరల్లోకంటే క్యాబేజీని సలాడ్లలో ఎక్కువగా వాడతారు.

బరువు తగ్గడానికి: ఒక వద్దాం క్యాబేజీలో 27 కెలోరీలు మాత్రమే ఉంటాయి. అంతేకాకుండా ఇది కడుపు నిండుగా ఉన్న భావాన్ని కలిగిస్తుంది. అందువల్ల క్యాబేజి తింటూవున్నా బరువు తగ్గే అవకాశాలు ఎక్కువ.

యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటి ఆక్సిడేటివ్: క్యాబేజీలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటి ఆక్సిడేటివ్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ ను తొలిగించి ఎన్నో ఆరోగ్య సమస్యలనుండి కాపాడుతాయి. ప్రాసెస్ చేసిన ఆహారం తినడం వల్ల కలిగే మంట ఇంకా వాపును రాకుండా చేస్తాయి.

అధికంగా విటమిన్ కే: క్యాబేజీలో ఉండే విటమిన్ కే ఎముకుల ఆరోగ్యంలో ముఖ్య పాత్రా పోషిస్తుంది. ఎముకుల సాంద్రతను కాపాడి దెబ్బలు మరియు ఫ్రాక్చర్లు అయినప్పుడు ఎముకులు త్వరగా కోలుకునేందుకు తోడ్పడుతుంది. రక్తం గడకట్టే విషయంలో ముఖ్య పాత్రా వహిస్తుంది.

మహిళల ఆరోగ్యం: క్యాబేజి ఈస్ట్రోజెన్ హార్మోన్ల స్థాయి అదుపులో ఉండేలా చేస్తుంది. ఈస్ట్రోజెన్ హార్మోన్లు మహిళల సంతానోత్పత్తి మరియు సెక్సువల్ దేవేలోప్మెంటుకు సహాయపడుతుంది.

డయాబెటిస్కు అనుకూలత: క్యాబేజీలో గ్లైసెమిక్ సూచిక తక్కువగా ఉండటం వలన రక్తంలో గ్లూకోస్ స్థాయిలు పెరగకుండా కాపాడుతుంది.

కీమో ప్రొటెక్టీవ్: క్యాబేజీలో సల్ఫర్ వంటి ఫైటోకెమికల్స్ ఉండటం వల్లన క్యాబేజి కీమో ప్రొటెక్టీవ్ మరియు ప్రోస్టేట్ కాన్సర్, కోలన్ కాన్సర్ వంటివి వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.

 

 

Leave a Comment