ఎక్కిళ్ళు ఆపేది ఎలా?
ఎక్కిళ్ళు మన రోజువారీ జీవితంలో చాల సహజంగా వస్తూ ఉంటాయి. అన్నం గబా గబా తినేటపుడు, లేదా కూల్డ్రింక్స్ తాగేటపుడు, ఒత్తిడిలో ఉన్నపుడు ఇల చాల సందర్భాల్లో వస్తాయి. కానీ కొంతమందికి కొన్ని నిమిషాల్లో తగ్గిపోతే, కొంతమందికి 48గంటలు దాటి వస్తూనే ఉంటాయి. ఇవి డయాఫ్రమ్ అసంకల్పితంగా స్పందించినపుడు కలిగే శారీరక మార్పులే. అయితే ఎహ్ ఎక్కిళ్ళు వస్తున్నంత సేపు ఏ పని పైన మనసు పెట్టలేము. ఎక్కిళ్ళను ఆపడానికి అనేక మార్గాలు ఎంచుకుంటారు.

కానీ ఎక్కిళ్ళు తగ్గడానికి కొన్ని సులువైన చిట్కాలు మనచేతిలోనే ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం:
click here for english
చల్లని ఐస్ నీళ్లు తాగడం: చల్లని ఐస్ నీళ్లు తాగడం వలన ఉదరవితానం(డయాఫ్రమ్)లో కలిగే చికాకు తగ్గి ఎక్కిళ్ళు ఆగిపోతాయి. అంతే కాకుండా ఐస్ నీళ్లా చల్లదనానికి జీర్ణ వ్యవస్థ షాక్బకి గురై ఎక్కిళ్ళు తగ్గిపోతాయి.కాబట్టి ఈసారి ఎక్కిళ్ళు వచినప్పుడు కొన్ని ఐస్ నీళ్లను తాగండి.

ఐస్ క్యూబ్స్: ఐస్ నీళ్లు మాదిరిగానే చల్లని ఐస్ ముక్కలను పీల్చటం వలన ఉదరవితానం(డయాఫ్రమ్)లో కలిగే చికాకు తగ్గి ఎక్కిళ్ళు ఆగిపోతాయి. ఈసారి ఎక్కిళ్ళు వస్తే ఒకేటి లేదా రెండు ఐస్ ముక్కలను వాడి ఎక్కిళ్లని కట్టిపడేయండి.

తేనే: మీరు తాగే చల్లని ఐస్ నీళ్ళల్లో కొంచం తేనే కలపడం వల్లకూడ ఎక్కిళ్ళు తగ్గే అవకాశాలు ఉన్నాయి. తేనేలో ఉండే వేడి వాళ్ళ ఉదరవితానంలో కలిగే గరగర తగ్గి ఎక్కిళ్ళు తగ్గుతాయి

ఊపిరిని బిగపట్టడం: ఊపిరిని బిగ్గపెట్టి కాసేపు ఉండటం వలన డయాఫ్రమ్ పూర్తిగా కాంట్రాక్టు అయ్యి అనియంత్రిత వ్యాకోచం తగ్గి ఎక్కిళ్ళు తగ్గుతాయి.

పంచదార: పంచదార కణికలు వాళ్ళ వాగస్ నాడిని ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల ఎక్కిళ్ళు ఆగిపోతాయి. అందువలన ఎక్కిళ్ళు వచ్చినపుడు ఒక టేబుల్ స్పూన్ పంచదారను నోట్లో వేసుకుని మంచినీళ్లు తాగితే ఎక్కిళ్ళు తగ్గుతాయి.

ఆపిల్ సైడర్ వెనిగర్: ఆపిల్ సైడర్ వెనిగర్లో ఉండే పెక్టిన్ వల్ల జీర్ణకోసంలో ఉండే రేపుదల చిరాకు తగ్గుతాయి. ఒకే చిన్న చెంచాడు ఆపిల్ సిడర్ వెనిగర్ను ఒక గ్లాస్ నీటిలో కలుపుకుని తాగడం వలన ఎక్కిళ్ళు తగ్గుతాయి.

పీనట్ బట్టర్/ ఆల్మండ్ బట్టర్: వేరే ఆహార పదార్ధాలతో పోల్చుకుంటే పీనట్ బట్టర్/ ఆల్మండ్ బట్టర్ వంటివి తినడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. వీటిని తినే విధానం వల్ల వాగస్ నాడి వేరేగా స్పందిస్తుంది. దీనివలన ఎక్కిళ్ళు తగ్గుతాయి. కాబట్టి ఎక్కిళ్ళు ఓచినపుడు ఒక చెంచా పీనట్ బట్టర్/ ఆల్మండ్ బట్టర్ కానీ తినడం వల్ల కూడా ఎక్కిళ్ళను ఆపొచ్చు.

నిమ్మరసం: నిమ్మరసాన్ని ఉపయోగించి ఎక్కిళ్ళను తగ్గించడాన్ని బార్టెండర్లు ట్రిక్ అని కూడా అంటారు. ఎక్కిళ్ళు ఓచినపుడు ఒక హాఫ్ స్పూన్ నిమ్మరసాన్ని తాగడం వల్ల కూడా ఎక్కిళ్ళు ఆగిపోతాయి.

చమోమిలే టీ: హెర్బల్ టీ ఆయన చమోమిలే టీ వల్ల కండరాలలో అనియంత్రిత వ్యాకోచం తగ్గుతుంది. దానివల్ల ఎక్కిళ్ళు వచ్చినప్పుడు చమోమిలే టీ తాగడం వల్ల ఎక్కిళ్ళు తగ్గుతాయి.

ముక్కును మూసి గాలి వదలడం: ముక్కుని నోటిని మూసి గాలిని వదలడానికి ప్రయత్నించాలి.దీనివల్ల చెవి రంధ్రాలు తెరుసుకుని ఎక్కిళ్ళు ఆగిపోతాయి అని చెప్తారు.

దగ్గడం: ఎక్కిళ్లు వచినప్పుడు దగ్గడం లేదా బర్పింగ్(తెంపు) చేయడం వలన లోపల ఉన్న గాలి బైటకి వచ్చి ఎక్కిళ్ళు తగ్గుతాయి.

ఊపిరి పీల్చుకోవడం: ఊపిరి పీల్చుకుంటూ లాలాజలాన్ని మింగడం వలన కూడా ఎక్కిళ్ళు తగ్గుతాయి. ఇలా చెయ్యడం వలన
వాగస్ నాడిని ఉత్తేజపడుతుంది. ఎక్కిళ్ళు తగ్గుతాయి.

ముఖ్యమైన నూనెలు: ముఖ్యమైన నూనెలలో ఉండే సువాసనల వల్ల నరాలు కుదుటపడతాయి. అందువలన ఎక్కిళ్ళు వచ్చినప్పుడు ఈ నూనెలు పీల్చడం మంచిది

వేడి పాలు: వీడి పాలు వాగస్ నాడిని ప్రేరేపిస్తుంది. దీనివల్ల ఎక్కిళ్ళు తగ్గుముఖం పడతాయి.

నోట్**: ఎక్కిళ్ళు 48గంటలు దాటి ఇంకా వస్తున్నాయి అంటే వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది. వీటికి ఉదరవితానం చుట్టుపక్కల వాపు, మెదడుకు సంబంధించిన వ్యాధులు, మానసిన రుగ్మతలు మరియు మూత్రపిండాల వ్యాధులు కూడా కారణం అవ్వొచ్చు.