కాళ్ళ పగుళ్లు ఇక మాయం
కాళ్ళ పగుళ్ల వల్ల కొన్ని సందర్భాల్లో కాళ్ళు బైటకి కనిపించకుండా జాగ్రత్త పడుతూ ఉంటాము. కాళ్ళ పగుళ్లు ముఖ్యంగా చర్మం అతిగా పొడిబారడం వల్ల, లేదా పాదాల కింద చర్మం గట్టిపడి విడిపోవడం, అధిక బరువు లాంటి కారణాల వల్ల కూడా వస్తాయి.

కాళ్ళ పగుళ్లు రాకుండా కాపాడుకోవడం ఎలా?
మంచినీరు ఎక్కువగ తాగడం: శరీరానికి కావాల్సినంత నీరు ఇవ్వడం వలన చర్మం పాదాలు పొడిబారకుండా ఉంటాయి.అందువలన ఎక్కువగ మంచినీరు తాగుతూ ఉండాలి.
మోయిస్తూరైజర్: రోజులో రెండు సార్లు మోయిస్తూరైజర్ రాసుకోడం వలన చర్మానికి కావాల్సిన తేమ అంది చర్మం పొడిబారకుండా ఉంటుంది.
పెట్రోలియం జెల్లీ: సన్నటి మోయిస్తూరైజర్ పూత పైన పెట్రోలియం జెల్లీ రాయడం వలన చర్మం మోయిస్తూరైజర్ను పీల్చుకుని ఎక్కువ సేపు పాదాలు మృదువుగా ఉంటాయి.
మృతకణాలని తొలిగించుట: అరికాళ్ళు కాసేపు గోరువెచ్చని నీటిలో నానిన తరువాత పూమిక్ స్టోన్ లేదా లూఫాతో మృదువుగా రుద్దడం వలన మృతకణాలు తొలిగిపోతాయి. తరువాత మోయిస్తూరైజర్ రాసుకోవడం వలన పాదాలు రోజు అంత మృదువుగా ఉంటాయి.
కాళ్ళతోలుని పీకోద్దు: అరికాళ్ళ చర్మాన్ని పీకడం వలన నొప్పితో పాటు ఇన్ఫెక్షన్లు అయ్యే అవకాశం ఉంటుంది.
సరైన షూస్ వేసుకోవడం: కాళ్ళ పగుళ్లు ఎక్కువగ ఉన్నపుడు చెప్పులు వంటివి బదులు వెనక భాగం మూసివేసి ఉన్న షూస్ వేసుకోడం వల్లనా దుమ్ము వంటివి వెళ్లకుండా ఉంటుంది.
వంటింటి చిట్కాలు:
షియా బట్టర్/ కోకోవ బట్టర్: షియా బట్టర్/ కోకోవ బట్టర్ రాయడం వలన చర్మం లో తేమ పెరుగుతుంది. అందువలన రాత్రి పడుకునే ముందు పాదాలకి రాసి వదిలేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి.

అరటిపండు: అరటిపండు చర్మాన్ని మృదువుగా చేసి కాళ్ళపగుళ్లు తగ్గేందుకు సహాయపడుతుంది. ఒక అరటిపండుని చిదిమి దానిని ఒక పోరా లాగ పాదాలకి రాసి 10నిమిషాల తరువాత కడిగేయండి.

ఆముదం: ఆముదం సహజమైన మోయిస్తూరైజర్ లాగ పనిచేస్తుంది. దీనిలో ఆరోగ్యమైన ఒమేగా ఫ్యాట్స్ ఈ పగుళ్లు తగ్గడానికి సహాయపడతాయి. రాత్రి పడుకునే ముందు రాసుకుని సాక్స్ వేస్కుని వదిలేయండి. పొద్దున్నకి మృదువు ఆయన పాదాలు మీసొంతం.

తేన: తేనెలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాల వలన కాళ్ళపగుళ్లు త్వరగా తగ్గడానికి సహాయపడుతుంది. ఇది కాళ్ళుకు నీటిలో నానిన తరువాత స్క్రబ్ లాగ పనిచేస్తుంది. అంతే కాకుండా ఓవర్నైట్ మాస్క్ లాగ కూడా వాడొచ్చు.

కొబ్బరినూనె: కొబ్బరినూనెలో ఉండే ముఖ్యమైన లక్షణాల వలన కాళ్ళ పగుళ్లు త్వరగా తగ్గుతాయి. కొబ్బరినూనె పగుళ్ళకు మాత్రమే కాకుండా
సోరియాసిస్ వంటి వాటికీ కూడా ఉపయోగపడుతుంది.

పరాఫిన్ వాక్స్: చాల లోతుగా ఉన్న కాళ్ళ పగుళ్ళులని కూడా పరాఫిన్ వాక్స్ తగ్గించడంలో ఉపయోగపడుతుంది. మృతకణాలని తొలిగించి మృదువైన చర్మాన్ని ఇస్తుంది. కరిగించిన పరాఫిన్ వాక్స్ని అరికాళ్ళకు పూతలాగా వెయ్యాలి. గట్టిపడిన తరువాత తీసేయొచ్చు. ఇలా చేయడం వలన పాదాలు మృదువుగా మారుతాయి.

*నోట్: కాళ్ళ పగుళ్లు చాల లోతుగా, లేదా ఇన్ఫెక్షన్ అయినట్టుగ అనిపిస్తే, డాక్టర్ను సంప్రదించడం మంచిది.