పెదాల చుట్టూ నలుపు లేదా హైపెరిపిగ్మెంటేషన్ పోవడం ఎలా?
పెదాల చుట్టూ చర్మం నల్లగా ఉండటం చాలమందిలో చూస్తూ ఉంటాము.అయితే అది కొంతమందికి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. అసలు పెదాల చుట్టూ చర్మం ఎందుకు నల్లగా మారుతుంది అంటే, చర్మం లో ఉండే మెలనిన్ అనే పిగ్మెంట్ అతిగా తయారు అవ్వడం వల్ల హైపెరిపిగ్మెంటేషన్ లేదా చర్మం నల్లగా మారడం జరుగుతుంది.

ఈ నల్లధనం కొన్ని రోజువారీ అలవాట్లు వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం.
లాలాజలం: కొంత మందికి పళ్ళ వరుస వల్ల కానీ, గాఢ నిద్రలో ఉన్నప్పుడు కానీ చొంగ కార్చే అలవాటు ఉంటుంది. ఆలా జరిగినపుడు లాలాజలం చర్మంకి తగిలిన ప్రదేశంలో నిలువ గీతాలు పడతాయి. అంతే కాకుండా దీని వల్ల దురద, చిరాకు వంటివి కలుగుతాయి. దానిని రుద్దడం కానీ గోకడం కానీ చేసినపుడు అది ఎరుపుగా మరి ఆఖరికి నల్లగా మారే అవకాశాలు ఉన్నాయి.
ట్రీట్మెంట్: రాత్రి పడుకునే ముందు నోటి చుట్టూ వాసెలిన్ రాస్కోడం వలన లాలాజలం చర్మానికి తగలకుండా ఉంటుంది.

కొన్ని అలవాట్లు: ఎక్కువగా పెదాలని తడుపుకోడం, చేతులతో రుద్దడం చేయరాదు. చర్మాన్ని ఆలా రుద్దినప్పుడు కలిగే వేడి వల్ల చర్మం నల్లగా మారుతుంది. గమనించాల్సిన మరొక విషయం ఏమిటి అంటే, ఎంత ఎక్కువ పెదాలని తడిపితే అవి అంత తేమను కోల్పోతాయి.
ట్రీట్మెంట్: ఈ అలవాట్లు మానుకోవడం తప్ప వేరే పరిష్కారం లేదు.

పెరిఒరళ్ డెర్మటైటిస్: పెరిఒరళ్ డెర్మటైటిస్ అనే కండిషన్లో నోటి చుట్టూ ఒక దద్దురులాగ వస్తుంది. మధ్య వయసు గల మహిళలో పెరిఒరళ్ డెర్మటైటిస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. చూడటానికి చిన్న చిన్న ఎరుపు మొటిమల లాగ ఉంటాయి.
ట్రీట్మెంట్:ఏంటిబయోటిక్స్ లేదా వాపు తగ్గడానికి మందులు లేదా క్రీములు వాడటం వల్ల తగ్గే అవకాశాలు ఉంటాయి.

స్టేరాఎడ్ క్రీములు వాడకూడదు: స్టేరాఎడ్ క్రీములలో కెమికల్స్ ఉండటం వలన నోటి చుట్టూ దురద వోచి రుద్దడం వలన నల్లగా మారే అవకాశం ఉంది.
ట్రీట్మెంట్: స్టేరాఎడ్ క్రీములు బదులు సన్స్క్రీన్ వాడటం మంచిది.

కాంటాక్ట్ డెర్మటైటిస్: ఈ కాంటాక్ట్ డెర్మటైటిస్లో ఏదైనా ఎలర్జీని కలిగించే వస్తువులు తాకడం వల్ల చర్మానికి ఇబంది కలుగుతుంది. అవి మీరు వాడే కాస్మెటిక్స్ కానీ బైట తాకే వస్తువులు కానీ అయుండొచ్చు.
ట్రీట్మెంట్: నోన్ఫ్లోరినాటేడ్ టూత్పేస్ట్ వాడటం మంచిది

కాన్స్టిట్యూషన్నల్ ఫాక్టర్స్: ఈ కాన్స్టిట్యూషన్నల్ ఫాక్టర్స్ విషయానికి వస్తే, దేనివల్ల చర్మం నల్లగా మారిందో మనకి తెలియకపోవచ్చు. ఒక ప్రత్యేకమైన కారణం అని ఉండకపోచ్చు. కానీ నోటి చుట్టూ పెదాల చుట్టూ చర్మం నల్లగా ఉండొచ్చు.
ట్రీట్మెంట్: స్కిన్ లైటెనింగ్ క్రీములు వల్ల కొంత వరకు మెరుగుగ అవొచ్చు. కానీ పూర్తిగా తగ్గుతుంది అని నమ్మకం లేదు.
ఎహ్ క్రీములు నల్లధనం తగ్గించడంలో సహాయం చేస్తాయి:
- కోజిక్ ఆసిడ్, నయాసినమేడ్ మరియు విటమిన్ సి ఉన్న క్రీములు బాగా పనిచేస్తాయి
- క్లియర్ జీ, బిలుమా, కోజివిట్ అల్ట్రా, మరియు డేమేలన్ వంటి క్రీములు ౬-౮ వారాలు వాడటం వల్ల మంచి ఫలితాలు ఉండొచ్చు
- చర్మం ఎరుపెక్కడంతో పాటు నల్లధనం కూడా ఉంటె, తక్రోలీమస్ క్రీము వాడటం వల్ల చర్మం చల్లబడి వాపు తగ్గుతుంది. ఒకవేళ పరిస్థితి తగ్గకుండా విషమంగా ఉంటె డాక్టర్ని సంప్రదించడం మంచిది
- సన్స్క్రీన్ రాసుకునపుడు నల్లగా ఉన్న ప్రదేశంలో కొన్చమ్ ఎక్కువ అప్లై చేయండి. జింక్ ఆక్సైడ్ ఉన్న సన్ స్క్రీన్ ఇంకా మేలు చేస్తుంది
పైన చెప్పిన పరిష్కారాలు పనిచేయకపోతే ఎలా?
1. మొండి మచ్చలు అయితే తేడా కనిపించడానికి కొంత సమయం పట్టొచ్చు. ఎలాంటి మార్పు లేదు అనుకుంటే, మేకప్ కన్సిలర్ను వాడండి. కలర్ కారెక్టర్ కూడా బాగా పనిచేస్తుంది
వంటింటి చిట్కాలు :
టమాటో ముక్కలు : టమాటోలో లైకోపీన్ ఉండటం చేత నల్లడం తగ్గించడానికి తోడ్పడుతుంది. ఒక ౧౫-౨౦ నిముషాలు ఉంచి ఆరిన తరువాత కడిగేయండి. ఆరిన చర్మానికి మోయిస్తూరైజర్ రాసి, తరువాత సన్స్క్రీన్ అప్లై చేయండి.

బంగాళాదుంప రసం: బంగాళాదుంప రసాన్ని పడకుంముందు రాసుకోవడం వలన మంచి ఫలితాలు వస్తాయి. ఇలా 4-6 వారాలు వరకు చేయడం మంచిది

పెరుగు మరియు తేన: పెరుగు నల్లధనాన్ని తగ్గిస్తుంది. అలాగే తేన చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఈ రెండు కలిపి 20-25 నిమిషాల పాటు ఉంచి చల్ల నీటితో కడిగేసుకోవాలి. తరువాత మోయిస్తూరైజర్ను రాసుకోండి.

నోట్ : నల్లధనం పోవడానికి ఎక్కువ సమయం పట్టొచ్చు.కావున కొంచెము ఓర్పుతో చిట్కాలు కనీసం 2 నెలలు ఆయన పాటించాలి.