పొడి బారిన చర్మంకి ఎం వాడాలి?
చర్మం పొడిబారడానికి చాల కారణాలు ఉండొచ్చు. అవి వాతావరణం వల్ల కానీ, కఠినమైన క్రీములు వల్ల కానీ, సబ్బుల వల్ల కానీ అవొచ్చు. పొడి చర్మం వల్ల మొహం పగలడం, ఎర్రగా అవ్వడం లాంటివి అవుతాయి. అందువలన పొడి చర్మంకి ఏది వాడితే మంచిది లేదా ఎలాంటి క్రీములు వాడాలి తెలుసుకుందాం.
ఫేసెవాష్: ఎలాంటి ఫేసెవాష్ ఎంచుకున్నా సరే , అది క్రీం బేస్డ్ అయి ఉండాలి. రోజుకి ఒకసారి మొహం కడుక్కుంటే సరిపోతుంది. మాములు నీళ్లుతో మొహం ఎక్కువ సార్లు కడిగిన సరే మొహం పొడిబారిన పడే అవకాశాలు ఎక్కువ.

మోయిస్తూరైజర్: ఒక మోయిస్తూరైజర్ కొనుక్కునే ముందు, అందులో గ్లిసెరోల్/గ్లిసరిన్ కానీ, వైట్ పరాఫిన్ కానీ కోకోవ బట్టర్ కానీ ఉండేలా చూసుకోవాలి. ఇవి చర్మానికి తేమని అందించి మృదువుగా ఉంచుతాయి. అలాగే ఫేసెవాష్ లాగ, మోయిస్తూరైజర్ కూడా క్రీం బేస్డ్ అయి ఉండాలి. దీనిని రోజుకి రెండు సార్లు రాసుకోవాలి. ఒకటి స్నానం చేసాక తడి చర్మం పైన, మరొకసారి రాత్రి పడుకునే ముందు.

బాడీవాష్: బాడీవాష్ ఎప్పుడూ కూడా గ్లిసరిన్ బేస్డ్ తీస్కోడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.

స్క్రబ్స్ని వాడకం వీలైనంత వరకు తగ్గించండి: స్క్రబ్స్ వాడడం వలన చర్మం మరింత పొడిగా మారే అవకాశాలు ఉన్నాయ్. కాబట్టి చర్మం శుభ్రపరుచుకోడానికి వారానికి ఒకసారి స్క్రబ్స్ బదులు సాలిసైలిక్ ఆసిడ్ ఉండేవి వాడటం మంచిది.

ముడతలు రాకుండా ఉండటానికి: వేరే వాళ్ళతో పోల్చుకుంటే పొడిచర్మం ఉన్నవాళ్ళకి త్వరగా ముడతలు వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి 25 సంవత్సరాలు దాటినా వారు (ఎహ్హెచ్ఎహ్) ఉన్నవాటిని వాడటం వల్ల ముడతలు రావడం తగ్గుతుంది

సన్ స్క్రీన్ : పొడి చర్మం కల వారు సన్ స్క్రీన్ కొనే ముందు క్రీం బేస్డ్ మరియు ఎస్ఫైఎఫ్ ౩౦ ఉన్నవి కొనుకోవాలి. రోజుకి రెండు లేక మూడు సార్లు రాసుకోవాలి. సన్ స్క్రీన్ లో టైటానియం డయాక్సైడ్ మరియు జింక్ ఆక్సైడ్ వంటివి ఉండేలా చూడాలి. వీరు బిబి ఇంకా సిసి
క్రీములును దూరంగా ఉంచాలి

వంటింటి చిట్కాలు:
అరటిపండు తేన పేస్ట్: అరటిపండుని చిదిమి అందులో కాస్త తేన కలిపి మోహానికి రాసుకున్నాక 15-20 నిముషాలు ఉంచాలి. తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి.

నోట్ : పొడి చర్మం కలవారు శనగ పిండి ఇంకా నిమ్మకాయ వంటి సిట్రస్ పండ్లు మోహానికి వాడకపోతే మంచిది. అలాగే అరటిపండు, పెరుగు, ఆపిల్ , క్రీం, తేన వంటివి మంచి ఫలితాలని ఇస్తాయి.